పట్టణాల్లోనూ ఐటి పరిశ్రమలు

ఐటి పరిశ్రమలు కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్క ప్రాంతంలోని అబివృద్ధి అంతా కేంద్రీకృతం కాకుండా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ తో పాటుగా వరంగల్, కరీంనగర్ నగర్ లలో ఐటి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాంతాల్లో ఐటి సంస్థలను నెలకొల్పడానికి ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల వసతులను కల్పించడంతో పాటుగా వారికి రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా నిజామాబాద్, వరంగల్ లలో టి -హబ్ లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని వల్ల కోవలం హైదరాబాద్ కు మాత్రమే అబివృద్ధి పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా అబివృద్ధి ఫలాలు అందేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు టీఎస్ఐపాస్ కింద 2,929 పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేసింది. దీని వల్ల దాదాపుగా రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగా అందుకు రెండు నుండి మూడు రెట్ల దాగా పరోక్షంగా ఉపాధి లభించినట్టయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటి పరిశ్రమ ద్వారా 75వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ఇటీవల కాలంలో ప్రపంచంలోని మోటి ఐటి కంపెనీలు గూగుల్,యాపిల్,ఫేస్ బుక్, అమేజాన్, ఐకియా తమ కార్యకలాపాలకు కోసం హైదరాబాద్ లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. యాపిల్ కంపెనీ హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరలిపోయిందనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. అయితే అవన్నీ కేవలం పుకార్లేనని యాపిల్ కంపెనీ హైదరాబాద్  లోనే కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *