ఎంసెట్ రద్దుయోచనలో ప్రభుత్వం

తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలిగిన ఎంసెట్ ఇప్పుడు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ కోర్పులకు క్రమంగా ఆదరణ తగ్గుతుండడంతో పాటుగా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉండడం ఉన్న వాటిలోనే సీట్లు భర్తీ కాకుండా పోతుండడంతో అసలు ఎంసెట్ నిర్వహణ అవసరమా అనే కోణంలో ప్రభుత్వం ఉంది. మెడికల్ పరిక్షల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి పోవడంతో ఇప్పుడు కేవలం ఇంజనీరింగ్ లో మాత్రమే ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో అసలు ఎంసెట్ ను ఎత్తివేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ప్రభుత్వ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎంసెట్ కు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయిన సంగతి గణాంకాల ద్వారా తెలుస్తోంది.  2016-17లో మొత్తంగా 1,43,820 సీట్లు అందుబాటులో ఉంటే.. 80 వేల సీట్లు (60 శాతం) కూడా నిండలేదు. కన్వీనర్ కోటాలో 1,00,674 సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో 54,172 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం మిగిలిపోయాయి. మేనేజ్‌మెంట్ కోటాలోనూ 43 వేలకు పైగా సీట్లుంటే భర్తీ అయిన సీట్లు 25 వేలకు మించలేదు.న్నారు.