ఈవిడ జయలలిత కూతురా?

ఫొటోలో ఉన్న ఈ అమ్మాయి ఎవరు… సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. జయలలిత పోలీకలతో ఉన్న ఈవిడపేరు వేద అని అమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎ హిస్టరీ చదివారని ఎంఫిల్ మధ్యలో ఆపేశారని రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఈవిడ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమారై అని నటుడు శోభన్ బాబు ద్వారా ఈ అమ్మాయి జయకు జన్మించిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సదరు ఫొటోలో ఉన్న ఆవిడ వయస్సు 38గా చెప్తున్నారు. జయలలిత, శోభన్ బాబుల కెరీర్ అత్యన్నత స్థాయిలో ఉన్న సమయంలో జయ గర్భం దాల్చినందు వల్ల ఈ విషయాన్ని బహిరంగ పర్చలేదనేది నెటిజన్ల వార్త. అయితే సదరు మహిళ ఇప్పుడు అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు. ఈవిడ పుట్టిన వెంటనే సింగపూర్ కు పంపించారని అక్కడే చదువుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిల్లో ఎంత నిజం ఉన్నది అన్నది మాత్రం తెలీదు. జయలలిత తన కెరీర్ లో కొంత సమయం సినిమాలకు దూరంగా ఉన్నారని ఆ సమయంలో బిడ్డకు జన్మనిచ్చారనే కథనాలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇవన్నీ సమాధానాలు తెలియని ప్రశ్నలు గానే మిగిలిపోయాయి.