ఈమె జయలలిత కూతురు కాదు…

జయలలిత కూతురుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న మహిళ అసలు పేరు దివ్యా రామచంద్రన్ అట, చెన్నైలో ప్రముఖ మృదంగ విధ్వాసుడు బాలాజీ మనుమరాలు. ప్రస్తుతం ఈవిడ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. జయలలిత పోలీకలు ఉన్న ఈవిడ జయ కూతురని ప్రస్తుతం అమెరికాలో ఉన్నరంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో దివ్యా రామచంద్రన్ కుటుంబీకులు ఈ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న చిత్రం చాలా పాతదని వారు పేర్కొన్నారు.

జయలలిత కూతురు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని వారు వివరించారు. జయలలిత పోలీకలు కనిపించడంతో ఆమె ఫొటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. జయలలిత కూతురని, శోభన్ బాబు జయలలితకు పుట్టిన బిడ్డ అని ఆమె సింగపూర్ లో చదువుకున్నారని హైదరాబాద్ లో ఎం చదివి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారనే ప్రచారం జరిగింది. చివరకు తమిళనాడుకు కాబోయే సీఎం కూడా ఈవిడే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆఖరికి అసలు విషయం బయటపడింది.