ఇటలీ నుండి ఢిల్లీ దాకా వచ్చాము మమ్ము ఆదు కొండి ……. తెలుగు విద్యార్థుల అభ్యర్ధన ……

కరోనా పీడిత దేశాలలో చైనా తరువాత ఎక్కువగా ఇబ్బంది పడిన దేశాలలో ఇటలీ ముందుంది. చైనా తరువాత జనవరి 2020 నుండి ఇటలీ , ఇరాన్ దేశాలలో కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నది. మార్చ్ 15, 2020 న భారత ప్రభుత్వము ఇటలీ లోని 218 మంది భారత జాతీయులను ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ ద్వారా ఢిల్లీ లు చేర్చింది. ఢిల్లీ విమానాశ్రయము నుండి నేరు గా కరోనా క్వారంటైన్ సెంటర్ లకు పంపి పరీక్షలు జరిపి 15 రోజుల పాటు వారిని ఇండో టిబెటియన్ బోర్డుర్ పోలీస్ శిబిరం లో ఉంచారు. 218 మంది లోని 32 మంది తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. వీరు అందరికి రెండు విడతలుగ జరిపిన పరీక్షలలో కరోనా నెగెటివ్ గ ఫలితాలు వచ్చాయి. మార్చ్ 25 నుండి అన్ని రవాణా సౌకర్యాలను నిలిపివేసినందు కు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు ఢిల్లీ లో ని ఇండో టిబెటియన్ బోర్డుర్ పోలీస్ శిబిరం లో ఉంది పోయారు. వారిని అక్కడి నుండి తమ తమ ప్రదేశాలకు పంపించటానికి అనుమతి ఇవ్వవలసినది గ వారి గురించి పట్టించు కోవలసినది గ క్యాంపు నందు ఉన్న తెలుగు వారు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నారు. ఇటలీ నుండి వచ్చిన తెలుగు విద్యార్థుల వివరాలకు , విద్యార్థి ప్రతినిధి వై శ్రీనివాసరావు ను 7799837922 మొబైల్ నెంబర్ పై సంప్రదించ వలసినది గ తెలియ పరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *