ఇండోనేషియాలో భారీ భూకంపం

 

ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకపం ధాటికి అనేక నిర్మణాలు నేలమట్టం అయ్యాయి. ఇప్పటివరకు 54 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు బావిస్తున్నారు.    ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో  సంభవించిన ఈ భూకంపం  రిక్టర్‌ స్కేలుపై 6.4 గా నమోదయింది. భూకంపం తీవ్రంగా ఉండడంతో భారీ కట్టడాలు కూడా నేలమట్టం అయినట్టు వార్తులు వస్తున్నాయు. వందల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. గాయపడ్డవారితో ఆస్పత్రులు నిండిపోయాయి. సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. విపత్తు నివారణ బృందంతో పాటుగా సహాయక చర్యలకు గాను సైనికులు కూడా రంగంలోకి దిగారు.  ఉత్తర సుమత్రాలోని బందా అసెకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.