ఇంటివద్దకే కొత్తనోట్లు…

ఏటీఎంలు, బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు పడుతున్న ప్రజలకు స్నాప్ డీల్ గొప్ప ఆఫర్ ను ప్రకటించింది. క్యాష్ ఎట్ హోం సర్వీసుల కింద ఇంటి వద్దకే నగదును తీసుకుని వచ్చి ఇస్తామని స్నాప్ డీల్ ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద  గరిష్టంగా ఒక బుకింగ్కు రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేయనుంది. నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్లో స్వైప్ చేసి స్నాప్డీల్కు ఈ నగదు చెల్లించవచ్చు. అయితే నామమాత్రపు రుసుము కింద రూ. 1ను కంపెనీ చార్జ్ చేయనుంది.బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. స్నాప్ డీల్ ప్రకటించిన ఈ ఆఫర్ ఎంత మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.