ఆమె జీవితమే ఓ పోరాటం

జయలిలత భారతదేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు. అమ్మగా, పురచ్చితలైవి (విప్లవ నాయకురాలు) గా అభిమానులు ఆప్యాయంగా పిల్చుకునే జయలలిత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆమె జీవితం వడ్డించిన విస్తరేం కాదు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా చిన్న తనంనుండీ తన కంటూ ఓ ప్రత్యేక ముద్రను వేయించుకున్న ధీశాలి జయలలిత. పట్టుదలకు, అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని వ్యక్తిగా పోరుపొందిన జయలలిత పెళ్ళి చేసుకోలేదు.

  • జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటిమైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.[4][5] జయలలిత అసలు పేరు కోమలవల్లి. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
  • చదువులో అత్యంత ప్రతిభాశీలిగా ఉన్న జయలలిత ఎప్పుడూ స్కూల్ టాపర్ గానే ఉండేవారు.
  • మెట్రిక్ లో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మార్కులు సంపాధించిన కొద్ది మందిలో ఒకరుగా నిల్చారు.
  • కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేటసినిమా రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది.
  • తమిళం,తెలుగుకన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో ఆమెకు మంచి ప్రవేశం ఉండడంతో చలన చిత్రసీమను జయలలిత ఏలింది.
  • ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది.
  • 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.

ఏంజీఆర్ మరణం తరవాత పార్టీలో జయ అనేక అవమానాలు ఎదుర్కోవాల్సివచ్చిందని చెప్తారు. అయితే వాటిని అధికమించి ఎంజీఆర్ కు అసలైన వారసురాలిగా తనని తాను ప్రకటించుకుంటూ జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.

  • జయలలిత1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది.
  • 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి.