ఆందోళన బాటలో వాసవీ ఇంజనీరింగ్ విద్యార్థులు

గండిపేట సమీపంలోని ఇబ్రహీంబాగ్ వద్ద ఉన్న వాసవీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మొదటి సంవత్సరం చదువుతున్న ఒక్కో విద్యార్థి ప్రస్తుతం అదనంగా 74వేల రూపాయలు చెల్లించాలంటూ కళశాల యాజమాన్యం తాఖీదులు పంపడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయించిన ప్రకారం కాళశాలలో చేరే సమయంలో ఒక్కో విద్యార్థి 86వేల 4వందలు ఇప్పటికే చెల్లించగా తాజాగా మరో 74వేలు చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు నోటీసులు పంపడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రతీ కళాశాలలో ఉన్న సౌకర్యాలను బట్టి ఉన్నత విద్యామండలి కళాశాల ఫీజులను నిర్థారిస్తుంది. ఈ క్రమంలో వాసవీ ఇంజనీరింగ్ కళాశాకు 86వేల 4 వందలుగా ఫీజును నిర్ణయించింది. దీనితో విద్యార్థులంతా అదే మొత్తాన్ని కట్టారు. దీనిపై కోర్టుకు వెళ్లిన వాసవి కళాశాల యాజమాన్యం కోర్టు ఉత్తర్వుల ప్రకారం మరో 74 వేల రూపాయలను కట్టాలంటూ విద్యార్థులకు నోటీసులు జారీచేయడంతో విద్యార్థులు, వారి తల్లతండ్రులు  ఆందోళన చెందుతున్నారు. అదనంగా 74వేలు చెల్లించాలంటే ఎట్లా చెల్లించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు ఇంజనీరింగ్ కాళశాలల యాజమాన్యాలు కోర్టుకు ఎక్కడంతో కోర్టు తీర్పు ప్రకారం ఫీజులను పెంచుతూ కాలేజీల యాజమాన్యలు నిర్ణయాలు తీసుకోవడం విద్యార్థులకు నోటీసులు జారీచేయడంతో విద్యార్థుల ఆందోళన అధికం అయింది. యాజమాన్యల తీరును నిరశిస్తూ వాసవీ కళశాల ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమానికి విద్యార్థులు సిద్ధమవుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా వీరి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఉన్నత విద్యామండలి, కళాశాలల యజమాన్యాల పోరులో విద్యార్థులు సమిధలవుతున్నారంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం జోఖ్యం చేసుకోని విద్యార్థులపై మోపుతున్న భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క సారిగా వేల రూపాయలు చెల్లించలంటూ నోటీసులు జారీచేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడున్నారని అంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుండి కడతారని వారు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *