అసెంబ్లీలో అర్తవంతమైన చర్చ

0
12

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అయినప్పటికీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీలో దీనిపై చర్చజరగాలని అన్ని పార్టీలు కోరడంతో అసెంబ్లీలో నోట్ల రద్దుపై అర్థవంతమైన చర్చ జరిగింది. అన్నిపార్టీల సభ్యులు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత కార్యకలాపాలకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని కేసీఆర్ చెప్పారు. నల్లధనం బయటకు వచ్చి పారదర్శక లావాదేవీలు జరగాలని తప్ప తమకు మరో ఉద్దేశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నగదు లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. నోట్ల రద్దు రాష్ట్ర ఆదాయం పై ప్రభావం చూపినప్పటికీ అది భయపడిన స్థాయిలో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని కేసీఆర్ వివరించారు.నగదు రహిత లావాదేవీల విషయంలో ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సీఎం సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నుండి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత కే.జానారెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దు పై కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని దీని వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే ఇంత పెద్ద నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం దేశప్రజలపై రుద్దిందని దుయ్యబట్టారు.
నోట్ల రద్దు అనే మాట సరైంది కాదని టీడీపీ శాసనసభా పక్షనేత రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాల ద్వారా నగదు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
ఎంఐఎం నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించింది. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించోకోవడంలేదని ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని దేశద్రోహులుగా ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డా దీర్ఘకాలంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. పేదలకు నోట్ల రద్దు వల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. నోట్ల రద్దు పై తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని సీపీఎం పేర్కొంది . నోట్ల రద్దును తాము వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీనేత సున్నం రాజయ్య చెప్పారు. తాము నల్లధనానికి వ్యతిరేకం కాదని అయితే నోట్ల రద్దు వల్ల ఎవరికి ప్రయోజనమో ఆలోచించాలన్నారు. నల్లధనాన్ని వెలికితీయడం కోసమంటూ నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here