అవసరమైతే ప్రాణాలు తీస్తా అంటున్న తమన్న

బాహుబలి లాంటి చిత్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి లేదా ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధమని అందాల నటి తమన్న అంటోంది. బాహుబలి లాంటి చిత్రంలో నటించే అవకాశం తనకు లభించడం అదృష్టమని అన్న తమన్న ఇటువంటి చిత్రంలో నటించడానికి దేనికైనా రెడీ అంటూ అవసరం అయితే ప్రాణాలు కూస్తానంటూ చమత్కరించింది. బాహుబలికి ముందు తాను నటించిన కొన్ని చిత్రాలు పరాజయం పాలైనా తన మీద నమ్మకంతో దర్శకుడు రజమౌళి తనకు ఈ చిత్రంలో అవకాశం కల్పించారని అన్నారు. దర్శకుడి అంచానాలకు తగ్గట్టు నటేందుకు తాను శాయశక్తుగా కృషిచేశానని చెప్పారు.

బాహుబలి రెండో పార్టులోనూ తాను ధరించిన అవంతిక పాత్ర  ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పారు. కొంత భాగం మినహా షూటింగ్ పూర్తయిందని డిసెంబర్ ఆఖరుకల్లా తన పాత్ర షూటింగ్ పూర్తయిపోతుందని తమన్న అన్నారు. చరిత్రలో మిగిలిపోయే ఒక గొప్ప చిత్రంలో తాను కూడా పాలు పంచుకున్నందుకు చాలా గర్వంగా ఉందని తమన్న అన్నారు.