అరుణ్ సాగర్ పేరిట పురస్కారం

ప్రముఖ జర్నలిస్టు,కవి, స్వర్గీయ అరుణ్ సాగర్ పేరిట ప్రెస్ అకాడమి ఒక అవార్డును ప్రకటించింది. జనవరి 2వ తేదీన జరగనున్న అరుణ్ సాగర్ జయంతి రోజున ఈ అవార్డును ఉత్తమ సేవలందించే పాత్రికేయులకు అందచేయనున్నట్టు తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఈ అవార్డు కోసం తెలుగు ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాకు చెందిన వారు తమ ఎంట్రీలను డిసెంబర్ 20వ తేదీ లోపుగా ఛాపల్ రోడ్డులో ఉన్న తెలంగాణ ప్రెస్ అకాడమికి పంపాలని ఆయన కోరారు. విలేకరులు 2016లో ప్రచురితమైన వార్తా కథనాలు పంచాలన్నారు. అరుణ్ సాగర్ పేరుతో ఎంపిక చేసిన కవి,రచయితకు కూడా పురస్కారాన్ని అందచేస్తున్నట్టు అల్లం నారాయణ తెలిపారు.