అయ్యప్ప మాల వేస్తే స్కూల్ కి రానీయం

అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులను యునిఫాం లేకుండా వచ్చారంటూ హింసించడం ప్రతీ సంవత్సరంలో ఏదో స్కూల్ లో జరుగుతూనే ఉంది. దీనిపై విద్యాసంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతున్న పాఠశాలల విద్యార్థులను వేధిస్తున్నారు. తాజాగా అయ్యప్ప మాల వేసుకుని స్కూల్ వచ్చాడంటూ స్కూల్ లోకి విద్యార్థని అనుమతించకపోవడంతో కాప్రాలోని కాల్ పబ్లిక్ స్కూల్ వద్ద కొద్దిసేపు ఉధ్రిక్తత నెలకొంది. పోలీసులు సకాలంలో జోఖ్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాల్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న నాలుగవ తరగతి విద్యార్థి ఒకరు అయ్యప్ప మాల వేసుకోని స్కూల్ వస్తే పాఠశాల యాజమాన్యంలో విద్యార్థిని స్కూల్ లోకి అనుమతించలేదు. దీనితో విద్యార్థి తల్లిదండ్రలతో పాటుగా స్తానికులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని పాఠశాల యాజమాన్యంపై వాగ్వాదానికి దిగారు. సంప్రదాయలను గౌరవించాల్సిన పాఠశాలలు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నయంటూ విరుచుకుపడ్డారు. దీనితో పాఠశాల వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వెంటనే పోలీసులు కలుగచేసుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది.