అమ్మో ఒకటో తారీఖు

ఒకటో తారీఖు కోసం ఎదురు చూసే సగటు వేతనజీవి ప్రస్తుతం మాత్రం ఒకటో తారీఖు వస్తున్నదంటే భయంతో వణికిపోతున్నాడు. పెద్ద నోట్లు రద్దు కావడం ఆ ప్రభావం ఏటీఎం ల పై పడడంతో ఒకటో తారీఖు వస్తుందంటే చెల్లింపులు అన్నీ ఎట్లా అని సామాన్యుడు మదన పడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ 80కి పైగా ఎటీఎంలు అందుబాటులోకి రాలేదు. దీనికి తోడు బ్యాంకుల్లో డబ్బులు తీసుకుందామన్నా బ్యాంకుల్లో కూడా డబ్బులు లేకుండడం ఉన్న చాంతాడంత క్యూలు ఉండడంతో పొద్దున లేస్తే పాల వాడితో మొదలై ఇంటి సామాన్ల దాకా ఎట్లా డబ్బులు కట్టాలో తెలియకు సామాన్యుడు మదనపడుతున్నాడు. అన్నీ ఆన్ లైన్ అయిపోయాయని చెప్తున్నా ఎక్కడా ఆన్ లైన్ చెల్లింపులు జరగడం లేదు. అత్యధిక దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపులకు దుకాణుదారులు ముందుకు రావడం లేదు. చిన్న పద్దుల చెల్లింపులు ఏవీ ఆన్ లైన్ లో జరగడం లేదు. దీనితో వారందరికీ నగదు రూపంలో ఎట్లా డబ్బులు కట్టాలి అనే సమస్య సగటు జీవిని వేధిస్తోంది. పాలు, కూరలు, కిరణా దుకాణాలు, ఇంటి అద్దే లాంటివి వాటన్నిటకీ నగదు చెల్లింపులే జరుగుతుంటాయి. మారిన పరస్థితుల కారణంగా ఒకటి అర దుకాణాల్లో తప్ప ఎవరూ నగదు రహిత చెల్లింపులకు ముందుకు రావడం లేదు. దీనితో పాచారీ సమాన్లు ఎట్లా తీసుకుని రావాలని, ఇప్పటివరకు తెచ్చిన అరువు ఎట్లా చెల్లించాలని సామాన్యుడు వేదన చెందుతున్నాడు. ఒకటో తారీఖు వస్తుందంటేనే భయపడుతున్నారు.