అమరులైన మరో ఏడుగురు సైనికులు

జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఆగడాలు, అరచాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా భారత్ సైనిక స్థావరాలపై దొంగ దాడి చేసి ఏడుగురు సైనికులను పొట్టనపెట్టుకున్నారు. పోలీస్ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు సైనిక స్థావరంపై దాడి చేశారు. సైన్యం అప్రమత్తమై చేసిన ఎదురుదాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలో ఏడుగురు భారత జవాన్లు అమరులయ్యారు. సైనిక కుటుంబాల నివాసం కూడా అయిన జమ్ము శివార్లలోని నగ్రోటా 166 ఆర్టిలరీ యూనిపై దాడిచేసిన ఉగ్రవాదులు అక్కడే ఉన్న సైనిక కుటుంబాలకు చెందిన వారిని బంధీలుగా పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరి ప్రయత్నాలను సైనికులు అడ్డుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనిక అధికారులతో సహా మొత్తం ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలోనే పాకిస్థాన్ సైనిక దళాలు భారత్ భూబాగంపైకి కాల్పులకు తెగబడ్డాయి.

  • ఉగ్రవాదులు గ్రెనెడ్లు విసురూతూ ఆర్మీ క్యాంప్ లోకి దూసుకువచ్చారు.
  • ఉగ్రదాడుల సమయంలో సైన్యానికి చెందిన కుటుంబసభ్యులు చూపిన తెగువ అపారం
  • ఉగ్రవాదులు జనావాసాల్లోకి చొరబడకుండా సైనిక కుటుంబాలు అత్యంత చాకక్యంగా, దైర్యంగా వారిని అడ్డుకున్నాయి.
  • ఆయుధాలు లేకుండానే సైనిక కుటుంబ మహిళలు చూపిన తెగువ వల్ల భారీ నష్టం తప్పింది.
  • అమరులైన సైనికులు మేజర్‌ గోసావి కునాల్‌ మన్నదీర్‌(33), మేజర్‌ అక్షయ్‌ గిరీష్‌ కుమార్‌ (31).
  • హవల్దార్‌ సుఖ్‌రాజ్‌ సింగ్‌(32),లాన్స్‌నాయక్‌ కదమ్‌ శంభాజీ యశోవంతరావ్‌ (32)-,రాఘవేంద్ర సింగ్‌(28),ఆసిప్‌ రాయ్‌ (32).
  • మరో సైనికుడి పేరును వెల్లడించలేదు.