రోడ్డెక్కితే ఇక కేసులే…

జగిత్యాల జిల్లా….అనవసరంగా రోడ్డెక్కిన, నిత్యావసర సరుకుల కోసం మూడు కిలోమీటర్ల నిబంధన దాటితే కేసులు

  • – – వారి యొక్క వివరాలు యాప్ లో నిక్షిప్తం
  • – – సిటిజన్ ట్రాకింగ్ కోవిడ్-19 అనే పేరుతో కొత్త యాప్
  • – – నేటి నుoడి జిల్లా లో అమలు
  • – – జిల్లా ఎస్పీ శ్రీమతి సింధుశర్మ ఐపీఎస్ గారు

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అడ్డగోలుగా రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త యాప్ ను సిద్ధం చేసింది. ఈ యొక్క యాప్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వారిని గుర్తించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిటిజన్ ట్రాకింగ్ కోవిడ్19 యాప్ ను నేటి నుoడి ఉపయోగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారు తెలిపారు. ఇక మీదట ఎవరైనా అనవసరంగా రోడ్డు ఎక్కితే ఎంత దూరం వెళ్లారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు వారి సమాచారాన్ని ఈ యొక్క యాప్ లో నమోదు చేయడంతోపాటు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఏ సమయంలో అయినా ఎవరైనా వారి ఇంటి నుండి 3 కిలో మీటర్ల దూరం మాత్రమే ప్రయాణించాలి అనే నిబంధనలను అనేక మంది ఉల్లంఘిస్తూ ఉండటంతో తెలంగాణ పోలీస్ శాఖ సిటిజన్ ట్రాకింగ్ కోవిడ్19 అనే పేరుతో ఒక యాప్ ను అభివృద్ధి చేసింది దీనిని క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కి, అధికారులకు వారి యొక్క ఫోన్, ట్యాబ్ లో నిక్షిప్తం చేయడం జరిగిందని తెలిపారు.

పని చేయు విధానం
ఎవరైనా రోడ్డుఎక్కినప్పుడు సమీపంలో ఉన్న పోలీసులు తమ వద్ద ఉన్న ఫోన్లో ఆ వ్యక్తి యొక్క వివరాలు అంటే పేరు, వాహనం నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ వంటివి ఈయొక్క యాప్ లో నమోదు చేయడం జరుగుతుంది ఆ వ్యక్తి అక్కడి నుoడి మరో కొంత దూరం వెళ్ళాక అక్కడ ఉన్న మరో పోలీసు ఆ వ్యక్తి పేరు,వాహనం నెంబరు, మళ్ళీ నమోదు చేస్తారు GPS ద్వారా పనిచేసే ఈ యాప్ వ్యక్తి ఎంత దూరం ప్రయాణించారు అనే విషయం చెబుతుంది దీన్ని బట్టి అతను మూడు కిలోమీటర్ల నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిస్తే వెంటనే కేసు నమోదు చేసి సదరు వాహనం ను సీజ్ చేయడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *