అత్యంత విషమంగా జయ ఆరోగ్యం-అపోలో ప్రకటన

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు అపోలో వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటన్ ను విడుదల చేశారు. అనారోగ్యంతో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు ఆదివారం రాత్రి తీవ్రమైన గుండెపోటు వచ్చినట్టు తెలిపిన ఆస్పత్రి వర్గాలు సోమవారం నాడు మరో ప్రకటనను విడుదల చేశాయి. జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని నిపుణులైన వైద్యులు ఆమెకు చికిత్సను అందచేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లైఫ్ సపోర్ట్ సిష్టంను జయకు అమర్చినట్టు ఆ ప్రకటనలో వివరించారు.