అగ్ని-5 రేంజ్ లోకి చైనా,పాకిస్థాన్

అత్యంత అధునాత ఖండాంతర క్షిపణిని భారత్ సిద్ధం చేసుకుంటోంది. ఐదు నుండి ఐదున్నర వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగల క్షిపణిని భారత సైనికుల అమ్ముల పొదిలో చేర్చేందుకు వేగంగా పరీక్షలు జరుగుతున్నాయి. అణు బాంబును సైతం మోసుకుని పోగల అగ్ని-5 ఖండాంత క్షిపణి పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షలు పూర్తయిన అగ్ని-5 ఇప్పుడు దాదాపు తుది పరీక్షలకు సిద్ధం అవుతోంది. ఈ పరీక్షలు కూడా విజయవంతం అయితే సైన్యం చేతికి ఈ అధునాతన క్షిపణి చేరుతుంది.
    వివిధ దశల్లో క్షపణిని పరీక్షించిన శాస్త్రవేత్తలు దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని పరీక్షలు దాదాపుగా పూర్తయ్యాయి. ఆఖరి పరీక్షను అతి త్వరలోనే నిర్వహించి దీని ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. తుది పరీక్షలను ఎడిశాలోని మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు కూడా విజయవంతం అయితే ఖండాంతర క్షీపణులను కలిగిఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే ల సరసన భారత్ చేరుతుంది.
    అగ్ని-5 క్షిపణి పరిధిలోకి పాకిస్థాన్ లోని అన్ని ప్రాంతాలతో పాటుగా చైనా లోని చాలా ప్రాంతాలు వస్తాయి. అవసరైన పక్షంలో భారత్ ఈ క్షిపణి ద్వారా ఆయా ప్రాంతాలపై దాడులు నిర్వహించ గలదు. అణు పాటవంతో పాటుగా రాడర్ల కళ్లు గప్పి ఈ క్షిపణి దూసుకుపోగలదు.