అక్సిజన్ సిలెండర్ల కొరతపై స్పందించిన ప్రభుత్వం

కరోనా రోగులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఆక్సిజన్ సిలెండర్ల కృతిమ కొరతను సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఇవి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న కారణంగానే ఆసుపత్రులకు సిలిండర్లు కొరత ఏర్పుడుతున్నదన్న వాదనలు నేపథ్యంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *