అందమే పెట్టుబడి

అందం,చలాకీతనం,మాయమాటలు వీటినే పెట్టుబడిగా పెట్టకున్న ఒక యువతి ఏకంగా 11 మందిని పెళ్లిచేసుకుని అందినకాడికి దోచుకుని ఉడాయించింది. పెళ్లిళ్లనే తన ఆదాయ మార్గాలుగా చేసుకున్న మాయలేడి 11 మందిని పెళ్లి చేసుకుని నగదు, బంగారంతో ఉండాయించింది. ఈ కిలాడి లేడీని కేరళ పోలీసులు అదుపులోకి తీసున్నారు. కోచికి చెందిన లారెన్ జస్టిన్ అనే వ్యక్తి తన భార్య 15లక్షల నగదు, బంగారంతో ఉడాయించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమె బండారం బయటపడింది. ఈమె నాలగు రాష్ట్రాలకు చెందిన 11మందిని పెళ్లిచేసుకుందని వారి నుండి కూడా అందినకాడికి దోచుకుని ఊడాయించిందని పోలీసులు చెప్పారు. ఈమె స్వస్థలం మద్యప్రదేశ్ లోని ఇండోర్ స్వతహాగా అందంగా ఉండే అసలు పేరు మేఘా. మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లికాని వారిని లేదా విడాకులు తీసుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారిని వలలో వేసుకునే మేఘాకు ఆమె చెల్లెలు, చెల్లెలి భర్త సహకరించేవారు. ముఖ్యంగా విడాకులు తీసుకున్నావారు, శారీరకంగా వైకల్యం ఉన్న వారిని ఎంచుకుని వారిని పెళ్లిపేరుతో మోసం చేసేదని పోలీసులు వెళ్లడించారు. డబ్బున్న వారినే లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో వారిని పెళ్లిచేసుకుని ఆ తరువాత అందినకాడికి దండుకుని భిచాణా ఎత్తేసేదని పోలీసులు వెల్లడించారు.