అంతా రహస్యం…

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నాటి నుండి అమె మరణించేంత వరకు ఆమెకు జరుగుతున్న చికిత్సకు సంబంధించి కానీ అమెకు సంబంధించిన వివరాలు కానీ ఎక్కడా బయటికి పొక్కలేదు. జయ ఆరోగ్యం మెరుగు అవుతోందని చికిత్స జరుగుతోందని అంటూ అపోలో యాజమాన్యం విడుదల చేసిన హెల్త్ బులెటన్ లు, అమ్మ త్వరలోనే ఇంటికి చేరుకుంటారంటూ అన్న డీఎంకే పార్టీ ప్రకటనలు మినహా బాహ్య ప్రపంచాలని లోపల అసలు ఎం జరుగుతున్నది అన్న దానిపై వచ్చిన వివరాలు దాదాపుగా శూన్యమే.

జయలలిత సన్నిహితురాలు శశికళ,మాజీ ప్రభుత్వ అధికారిణి షీలా బాలకృష్ణన్ లాంటి ఒకరిద్దరు మినహా చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించే వీలు ఎవరికీ లభించలేదు. వీవీఐపీలు కూడా ఆసుపత్రికి వచ్చి శశికళతో మాట్లాడి వెళ్లడం మినహా జయలలితను చూసింది లేదు. అసలు జయ ఆరోగ్యం పై వాస్తవాలు బయకు రావాలంటూ కోర్టును సైతం కొందరు ఆశ్రయించారు. అంతా గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్య పద్దతిలోనే జయలలిత చికిత్స జరిగింది.

బాహ్య ప్రపంచంతో పాటుగా అన్నాడీఎంకేలోని అత్యున్నత స్థాయి నాయకులకు కూడా అసలు వాస్తవాలు తెలియవు. ఎమి జరుగుతోందో అన్న దానిపై క్లారిటీ లేదు. ఇక జయలలితకు గుండెపోటు వచ్చిందనే అపోలో ఆసుపత్రి వర్గాల ప్రకటన తరువాత కూడా హై డ్రామానే నడిచినట్టు అన్నా డీఎంకే వర్గాలు వెల్లడిస్తున్నాయి. అమ్మకు గుండెపోటు వచ్చిందని తమకు సమాచారం వచ్చిందని వెంటనే తాము హుటాహుటిన ఆస్పత్రికి వచ్చినా తమకు అమ్మను చూసే అవకాశం లభించలేదని వారు చెప్తున్నారు. అంతా సర్థకుంటుందనే తమకు చెప్తూవచ్చారని వారంటున్నారు. అమ్మను చూపించాల్సిందిగా తాము ఎంత బతిమిలాడినా సాధ్యంకాలేదని చెప్పారు. అమ్మ వెంటిలేటర్ పై ఉందనే సమాచారం మాత్రమే తమకు చెప్తువచ్చారని ఆ తరువాత పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ అపోలో ఆసుపత్రిలో సమావేశం కావాలని పార్టీ ఎమ్మెల్యేలకు వర్తమానం అందింది. ఆ తరవాత శశికళ వర్గం ఎమ్మెల్యేల పేర్లతో పైన ఏదీ రాయకుండానే సంతకాలు తీసుకున్నారని వారు వెల్లడించారు.

ఆ తరువాత రెండు గంటల సమయంలో అమ్మ ఆరోగ్యం మరింత విషమించిందని అమె బతికే అవకాశాలు దాదాపుగా లేవనే సమాచారం అన్నాడీఎంకే నేతలకు అందింది. ఆసుపత్రి నుండి పార్టీ కార్యాలయానికి సమావేశం ప్రదేశం మారింది. అక్కడ పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నట్టు సమాచారం అందింది. అప్పటికప్పుడు హుటాహుటిన రాజ్ భవన్ కు వర్తమానం అందింది. జయలలిత మరణించినట్టుగా ఆపోలో ఆసుపత్రి వర్గాలు వెళ్లడించిన మరుక్షణమే పన్నీరు సెల్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాటు జరిగిపోయాయు. ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకుని బస్సులు రాజ్ భవన్ కు బయలు దేరాయి. ఎక్కడా అసంతృప్తులు రాకుండా, మరో పేరు తెరమీదకు రాకుండా శశికళ ఇక్కడ అత్యంత చాకక్యంగా వ్యవహరించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

జయలలితను ఆసుపత్రిలో చూడడానికి తమను కూడా అనుమతించకపోవడం పై ఇప్పటికే ఆమె అన్నకూతురు విమర్శలు గుప్పిస్తున్నారు. జయలలిత మరణం తరువాత అమెకు సంబంధించిన అనేక విషయాలు ఇక బయటకు వచ్చే అవకాశం ఉంది.